హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహానంది హుండీకి రూ.52.84 లక్షల ఆదాయం

NDL: శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఇవాళ 62 రోజుల హుండీ లెక్కింపులో రూ.52,84,001 ఆదాయం లభించింది. హుండీల ద్వారా రూ.52,38,734, అన్నప్రసాదం ద్వారా రూ.25,364, గో సంరక్షణకు రూ.19,903 వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానుకలుగా 12.75 గ్రాముల బంగారం, 142 గ్రాముల వెండి లభించాయి. విదేశీ కరెన్సీ కూడా కానుకలుగా లభించినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు.