BHPL: చిట్యల మండలం భీష్మనగర్ గ్రామంలో సీఐ వై. సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 22 వాహనాలకు జరిమానాలు విధించగా, అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. సైబర్ నేరాలు, అపరిచితుల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
భీష్మనగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్


