అనంతపురం నగరంలోని బరమప్ప వీధి అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఓ. ఆనంద్ పోషణ్ మాహ్ వేడుకల్లో భాగంగా శనివారం తనిఖీ చేశారు. లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించి పోషకాహారం, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. చిన్నారులు, తల్లుల ఆరోగ్యం, శ్రేయస్సు కాపాడటానికి అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. దైనందిన ఆహారంలో ప్రొటీన్ ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ కేంద్రంలో కలెక్టర్ తనిఖీ


