హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులను ఆదుకోవాలి: సీపీఐ

BPT: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతాంగం ఇబ్బందులు పడుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. శనివారం బాపట్ల సీపీఐ కార్యాలయంలో మాట్లాడారు. కరువును అత్యవసర పరిస్థితిగా ప్రకటించి రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఉచిత విత్తనాలు అందించాలని కోరారు. కౌలు రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.