ADB: జిల్లాలో గణపతి నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని, చెరువులు, వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ


