హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు కార్డుల పంపిణీ

శ్రీకాకుళం నియోజకవర్గంలో అర్హులైన మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ ఆయిల్ కార్డులను ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం అందజేశారు. నియోజకవర్గంలో 303 ఇంజిన్ బోట్లకు నెలకు ఒక్కో బోటుకు 300 లీటర్ల చొప్పున, లీటరుకు రూ.9 ఫ్రంట్ ఎండ్ సబ్సిడీగా ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి నెలకు రూ.2,700, మొత్తం రూ.18.18 లక్షల లబ్ధి చేకూరుతుందన్నారు.