హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎంపీ ఫ్లెక్సీల తొలగింపుపై నిరసన

MNCL: మంచిర్యాలలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలను తొలగించిన కార్పొరేషన్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని శనివారం మంచిర్యాలలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసిన ఎంపీ వంశీకృష్ణకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారని జిల్లా ఛైర్మన్ పైడిమల్ల నర్సింగ్ తెలిపారు.