KNR: పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాట్లపై సమీక్షించారు. ఈనెల 27న ఎల్ఎండీ డ్యాం, మ్యూజియంను విద్యార్థులు సందర్శించేలా చర్యలు చేపట్టాలని, పర్యాటక ప్రాంతాల చరిత్ర, ఫోటోలు, క్యూఆర్ కోడ్‌లతో వివరించాలని, హోర్డింగులు ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణ
'పర్యటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి'


