హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి'

KNR: డబుల్ బెడ్ రూం ఇళ్లకు అవసరమైన మరమ్మతులు చేయించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ, ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల పరిసరాలు శుభ్రం చేయించి నీరు, విద్యుత్, రోడ్డు వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని, లబ్ధిదారులకు సమస్యలు రాకుండ చూడాలన్నారు.