CTR: పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం సాధ్యమని ఐసీడీఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి తెలిపారు. సదుం మండలంలోని గొడ్లవారిపల్లె అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలను శనివారం నిర్వహించారు. పోషకాహార లోపంతో రక్తహీనత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ఆకుకూరలు, కాయగూరలు ఆహారంలో భాగం చేసుకుంటే తగిన పోషకాహారం లభిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోషకాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలి'


