MDK: జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని తాత్కాలికంగా ప్రారంభించేందుకు అనువైన పాఠశాల భవనాలను గుర్తించాలని అధికారులను కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. హవేలీ ఘనపూర్ మండలంలో శాశ్వత నిర్మాణం కోసం 6 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. భవనాలు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ ప్రాంగణంలో తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
తెలంగాణ
'మెదక్‌లో కేంద్రీయ విద్యాలయం'


