హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తిపాకలో పేరెంట్ టీచర్స్ సమావేశం

PDPL: ధర్మారం మండలం పత్తిపాక ప్రైమరీ స్కూల్లో శనివారం పేరెంటు టీచర్స్ సమావేశం (PTM) నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, మధ్యాహ్న భోజనం మొదలగు విషయాలపై చర్చించారు. తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులు ఆంగ్ల సంభాషణ, నాటికలు ప్రదర్శించారు. దీంతో తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలని హెచ్ఎం మల్లన్న కోరారు.