హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదు'

VSP: బడుగు బలహీన వర్గాల భూములను ఆక్రమిస్తే సహించేది లేదని వైసీపీ అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో సుమారు 500 ఎకరాల భూములపై కూటమి నేతలు కన్నేశారని ఆరోపించారు. పంచదార్లలో దళితుల భూములు,భోగాపురం విమానాశ్రయ పరిసరాల్లోని డీ-పట్టా భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.