KDP: నాలుగేళ్లుగా పెరగని హమాలీ కార్మికుల కూలీ రేట్లను వెంటనే పెంచాలని బద్వేల్ CITU నాయకులు సహాయ కార్మిక అధికారి సుజిత్‌కు వినతిపత్రం అందజేశారు. నిత్యావసర ధరలు పెరిగినప్పటికీ, మూడేళ్ల ఒప్పంద గడువు దాటి ఏడాది అవుతున్నా రేట్లు పెంచకపోవడం అన్యాయమన్నారు. సిమెంట్, ఫెర్టిలైజర్స్ అసోసియేషన్లతో చర్చలు జరిపి న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
హమాలీ కూలీ రేట్లు పెంచాలి: సీఐటీయూ


