హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. గడియార స్తంభం, అమూల్య, గాంధీ క్లాత్ మార్కెట్ ప్రాంతాల్లోని గణపతి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిమజ్జన ఊరేగింపులో స్వయంగా ట్రాక్టర్ నడిపి సందడి చేశారు. వేడుకలు ప్రశాంతంగా సాగాలని కోరారు. టీడీపీ నేతలు, భక్తులు పాల్గొన్నారు.