హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సరఫరాపై కలెక్టర్ కీలక ఆదేశాలు

సత్యసాయి: పీఏబీఆర్ డ్యామ్ నుంచి మడకశిర నియోజకవర్గం, తుంకుంట పారిశ్రామిక ప్రాంతానికి పూర్తిస్థాయిలో తాగునీరు అందించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. అమరాపురం, బసవనపల్లి, కేకతి, మెలోయ్ సంపులను పరిశీలించారు. మోటార్లు, విద్యుత్ ప్యానెళ్ల పనితీరును సమీక్షించారు. పైప్‌లైన్ లీకేజీలు, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.