హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొక్కలు నాటి నిరసన తెలిపిన ఉద్యోగులు

SKLM: టెక్కలి ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది, నర్సులు తమకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని మొక్కలు నాటుతూ శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని, క్రమబద్ధీకరించే వరకు 100% గ్రాస్ శాలరీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందులో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.