హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్లు లేక ప్రజల ఇబ్బందులు పడుతున్నారు'

WG: భీమవరం 8వ వార్డు చినరంగనపాలెంలో రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని CPM నేత ఎం. వైకుంఠరావు తెలిపారు. 10వ వార్డులో వీధిలైట్లు వెలగక, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని ఆయన అధికారులను హెచ్చరించారు.