హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త సేకరణపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలులో 'ఒక గంట - ఒక నగరం - ఒక లక్ష్యం' కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో భాగంగా టీచర్స్ కాలనీలో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ నిర్వహించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయ్ కుమార్ పాల్గొని ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగమవ్వాలన్నారు.