హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఛైర్మన్‌ను కలసిన శ్రీవారి ఆలయ వాహనబేరర్లు

TPT: తిరుమల శ్రీవారి ఆలయ వాహనబేరర్లు శనివారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. తమ వేతనాల పెంపు తదితర అంశాలపై వినతి పత్రం అందించారు. వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, అధికారులతో చర్చించి, టీటీడీ బోర్డు దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.