హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వంటింటి బడ్జెట్‌కు ధరల సెగ'

PPM: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం పార్వతీపురంలో మాట్లాడారు. ధరల దెబ్బకు వంటింటి మెను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలను నియంత్రించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.