MBNR: జడ్చర్ల మండలం కోడ్గల్ అంగన్వాడీ కేంద్రం-IIలో శుక్రవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. CDPO సంధ్యారాణి గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. పోషకాహార లోపం రాకుండా పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సావిత్రి, ఏఎన్ఎం లలిత, అంగన్వాడీ, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
పోషకాహారమే ఆరోగ్యానికి పునాది..!


