కోనసీమ: అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని రాజోలు సీఐ వీ.సురేష్‌బాబు సూచించారు. విద్యార్థులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారితో పాటు మూగజీవాలకు సైతం అధిక శబ్దం ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. ప్రజలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని సీఐ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డీజేలతో ఇబ్బందులు కలిగించవద్దు: సీఐ


