ASR: అరకులోయ మండలంలో వివిధ సామాజిక భద్రతా పెన్షన్లకు అర్హులైన వారి నుంచి 1,554 నూతన దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో వీసం ప్రసాద్ తెలిపారు. వీటిలో వృద్ధాప్య పెన్షన్లు 1,141, వితంతు 251, దివ్యాంగులు 157, ఒంటరి మహిళలు 4, సాంప్రదాయ గీత కార్మికులవి ఒకటి ఉన్నాయన్నారు. దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి అర్హులకు పెన్షన్లు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్‌లకు 1,554 దరఖాస్తులు


