ప్రకాశం: కనిగిరి మండలం విశ్వనాథపురం అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎంవీఎస్ పార్వతి ఆధ్వర్యంలో జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, బాలికలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపం నివారణపై అవగాహన కల్పించారు. మునగాకు ప్రయోజనాలు, పోషకాహారం, మారిన మెనూ, రేషన్ వివరాలను వివరించారు. అంగన్వాడి కార్యకర్తలు, పిల్లలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విశ్వనాథపురంలో జాతీయ పోషణ మాసం


