హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తల మృతితో చలించిన శ్రీకాంత్‌రెడ్డి

అన్నమయ్య: సంబేపల్లె రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అలీ, కలందర్ మృతిచెందడంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం వారి స్వగ్రామాలకు చేరుకుని భౌతిక కాయాలపై పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.