హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంపద కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

అన్నమయ్య: రామాపురం మండలం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కుమ్మరపల్లె గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం పరిశీలించారు. గ్రామంలో చెత్త సేకరణ, తరలింపు, తడి- పొడి చెత్త వేర్పాటు, వర్మీ కంపోస్టింగ్ ప్రక్రియపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హ్యాబిటేషన్ల వారీగా చెత్త సేకరణ తీరును పరిశీలించారు.