హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

RR: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జీఓ-118 పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకాకుండా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తనకు వెళ్లే హక్కు ఉందని స్పష్టం చేసినప్పటికీ పోలీసులు అనుమతించకపోవడంతో, ఆయన తన కారు దిగి బైక్‌పై అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.