హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటిన జిల్లా జట్టు

KNR: టీజీ ట్రాన్స్‌కో/డిస్కంల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో కరీంనగర్ జట్లు సత్తా చాటాయి. బాస్కెట్ బాల్ ఫైనల్లో ఖమ్మం జట్టుపై 45–20 తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలవగా, టేబుల్ టెన్నిస్‌లో తృతీయ స్థానం దక్కించుకుంది. కెప్టెన్ ఈఎల్పీ రాజు, సభ్యుల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని మేనేజర్ రాజ్‌కుమార్ తెలిపారు.