హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటి ఖాళీ స్థలం స్వాధీనం

MHBD: కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన ఎగ్గేపు రజిత, మణికంఠ మహిళా సంఘం నుంచి తీసుకున్న రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సభ్యులు తెలిపారు. పలుమార్లు సంప్రదించిన బకాయి వసూలులో భాగంగా ఎగ్గేపు రాంబాబుకు చెందిన ఇంటి ఖాళీ స్థలాన్ని సంఘం సభ్యులు శనివారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సంఘానికి సహకరించాలని కోరారు.