హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ-ఆటోలతో సమర్ధవంతంగా చెత్త సేకరణ: మంత్రి

NDL: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్యంతో బనగానపల్లె నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ-ఆటోలను ప్రారంభించి పంచాయతీ కార్మికులకు అందజేశారు. ఈ-ఆటోలతో చెత్త సేకరణ మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని మంత్రి బీసీ పేర్కొన్నారు.