MLG : మంగపేట (M)రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో గొల్లగూడెం రెవెన్యూ భూములకు శనివారం అధికారులు హద్దులు ఏర్పాటు చేశారు. మంగపేట సర్వేయర్ ఎస్కే సపియ్యా, ఏఎస్సై కంచి ఏసుపాదం ఆధ్వర్యంలో గ్రామస్థులు, స్థానిక నాయకుల సమక్షంలో సరిహద్దులను గుర్తించారు. రెవెన్యూ భూములపై స్పష్టత కోసం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,సర్వేయర్ల పాల్గొన్నారు.
తెలంగాణ
రెవెన్యూ భూములకు హద్దులు ఏర్పాటు


