GNTR: రొంపిచర్ల(M) గోగులపాడులో ట్రాక్టర్ బోల్తా పడి భాస్కరరావు అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఉదయాన్నే వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన ఆయన, ట్రాక్టర్‌ను పొలంలోకి దించుతుండగా ఎత్తుపల్లాల కారణంగా అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్ కిందపడి భాస్కరరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ బోల్తా పడి రైతు దుర్మరణం


