హైదరాబాద్: 28°C
క్రీడలు

INDకు జెర్సీల సమస్య.. రంగంలోకి బీసీసీఐ

ఆసియా క్రీడల కోసం బయల్దేరనున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లకు జెర్సీ సైజుల విషయంలో కిట్‌ సమస్యలు తలెత్తాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ ఇబ్బందిని గుర్తించిన బీసీసీఐ వెంటనే స్పందించి ఐఓఏ భాగస్వామి జేఎస్‌డబ్ల్యూతో చర్చలు జరిపింది. ప్రస్తుతం చాలా వరకు సమస్యను సరిదిద్దామని, సరిచేసిన కిట్లు త్వరలోనే ఆటగాళ్లకు అందుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.