హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అట్ట‌హాసం ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మం

విశాఖలో పేదల సొంతింటి కల నిజమైంది. సీఎం సమక్షంలో ఇళ్ల పట్టాల పంపిణీ శనివారం ఘనంగా ప్రారంభమైంది. 11 మండలాల్లోని 399 ఎకరాల ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న పేద కుటుంబాలకు రూ.8,874 కోట్ల విలువైన ఆ స్థలాలను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కుల పట్టాలను అందజేసి వారి కలలను సాకారం చేశారు.