హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం

WG: ప్రమాదవశాత్తు కాలువలో పడి మహిళ గల్లంతైన మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది. తణుకు 20వ వార్డుకు చెందిన కొచ్చర్ల పద్మతులసి (52) శుక్రవారం సాయంత్రం కాలువలలో బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలువ రేవులో పడి గల్లంతు అయిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని తణుకు మండలం వేల్పూరు సమీపంలో గుర్తించినట్లు పట్టణ ఎస్సై సత్యనారాయణ తెలిపారు.