హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వనిపెంట PHC ఆకస్మిక తనిఖీ..!

KDP: మైదుకూరు మండలం వనిపెంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగంధర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులను వైద్య సేవలపరంగా ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.