హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రదర్శన

ప్రకాశం: కంభం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అధికారులు శనివారం ప్రదర్శించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తుది జాబితాను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో వీరభద్రాచారి తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలను ఓటర్లు ముందుగానే పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.