హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై

ASR: అభ్యాస్ కార్యక్రమంలో భాగంగా ముంచంగిపుట్టు ఎస్సై పీ.నాని శనివారం పెదగూడ జీటీడబ్ల్యూఏ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు డిసిప్లిన్, సైబర్ భద్రత, పోక్సో చట్టం, మహిళలు-పిల్లల సంరక్షణపై అవగాహన కల్పించారు. అలాగే, గంజాయి, గుట్కా వంటి వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు.