KKD: పెద్దాపురం డీఎస్పీ ఆదేశాల మేరకు సత్యనారాయణపురంలో పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 25 ద్విచక్ర వాహనాల రికార్డులను పరిశీలించడంతో పాటు, బయట ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వారి ఇళ్లను తనిఖీ చేశారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ కృష్ణ భగవాన్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సత్యనారాయణపురంలో పోలీసుల కార్డాన్ సెర్చ్


