హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు: బీఎస్పీ నేతలు

KKD: జగ్గంపేటలో బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ జుత్తుక నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలపై ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.