హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బారువ బీచ్‌లో తీర పరిశుభ్రత

SKLM: సోంపేట మండలం బారువ బీచ్‌లో శనివారం TREE ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం నిర్వహించారు. 251 మంది పాల్గొని 450 కిలోల ప్లాస్టిక్, సముద్ర వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు సముద్ర జీవుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు ముప్పు ఉందని, తీరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.