ASR: రాజవొమ్మంగి మండలం వాతంగి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ట్రాకర్ ద్వారా గుర్తించినట్లు అటవీ అధికారి ఉషారాణి తెలిపారు. పులి కొండ ప్రాంతంలో సంచరిస్తున్న నేపథ్యంలో కొమరాపురం, ఓగిపాలెం, రెల్లంగిపాడు తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను అడవిలోకి తీసుకెళ్లవద్దని, ఒంటరిగా అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పులి కదలికలతో గ్రామాల్లో అప్రమత్తత


