హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి'

అనకాపల్లి జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మునగపాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలన్నారు.