CTR: కృష్ణా జలాలతో చెరువులను నింపడం జరుగుతుందని దీని ద్వారా నీటి ఎద్దడి తీరనుందని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు పేర్కొన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా పుంగనూరు తదితర ప్రాంతాలకు కృష్ణా జలాలు చేరుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం మండల పరిధిలోని ప్రసన్నయ్య గారి పల్లి సమీపాన హంద్రీ నివాలో వెళుతున్న జలాలకు పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన టీడీపీ ఇంఛార్జ్


