హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

KRNL: ఆదోని- ఇస్వి రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున రైలు కిందపడి సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని మహిళ తీవ్రంగా గాయపడింది. 108 సిబ్బంది ఆమెను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు.