హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రియురాలిని చంపిన ప్రియుడు

W.G: తాడేపల్లిగూడెం ఎల్. అగ్రహారం టిడ్కో కాంప్లెక్స్‌లో యాదాల మంగ (28) దారుణ హత్యకు గురైంది. ముందూరుకు చెందిన గెడ్డం సందీప్ (సన్నీ) అనే వ్యక్తి, మంగ వేరొకరితో ఫోన్ మాట్లాడటంతో అనుమానించి గొడవపడ్డాడు. అనంతరం ఆమె పీక నులిమి ప్రాణాలు తీశాడు. మృతురాలి సోదరి రత్నమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.