హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

15 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్: పెనుగొండ SI

WG: పెనుగొండ మండలంలోని రెండు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై గంగాధర్ శనివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 22,800 నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మండలంలో పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.