హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి

MBNR: భూత్పూర్ మండలం కొత్తమొల్గర సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. భూత్పూర్ వైపు బైక్‌పై వెళ్తున్న శ్రీనాథ్ (19)ను వ్యాన్ ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో శ్రీనాథ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.