హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పన్నను దర్శించుకున్న సీఈవో

VSP: రైతు బజార్ల సీఈవో డా. కె. మాధవీలత ఐఏఎస్ దంపతులు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు వారికి ఘన స్వాగతం పలికారు. మాధవీలత ఆలయంలోని ప్రసిద్ధ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు తీర్చుకోగా, వేద పండితులు వారికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.